KKR వద్దని వదిలేసింది.. ఇప్పుడు అతనే ఇరగదీస్తున్నాడు?

praveen
సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి మందు జరిగే మినీ వేలంలో ఎన్నో టీమ్స్ తమ జట్టుకు భారంగా మారిపోయారు అనుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేయడం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారి స్థానంలో కొత్త ప్లేయర్స్ ని జట్టులోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా జట్టులో అవసరం లేదు అని వదిలేసుకున్న ఆటగాళ్లు.. ఇక ఆ తర్వాత మంచి ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన దేశవాళి ట్రోఫీ అయిన రంజీ ట్రోఫీ జరుగుతూ ఉండగా.. ఇక ఈ టోర్నీలో ఎంతోమంది దగ్గర అదరగొడుతున్నారు.

 ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వదిలేసుకున్న నారాయన్ జగదీషన్  కూడా అదరగొట్టేస్తున్నారు. ఏకంగా వరుస డబుల్ సెంచరీ తో ఇరగదీస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇటీవల కోయంబత్తూరులో చండీగఢ్ తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇది అతనికి వరుసగా రెండో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. గతంలో రైల్వే జట్టుతో రంజి ల్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 245 పరుగులు చేసి అజయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీ తో అతని వదిలేసిన కోల్కతా నైట్ రైడర్స్ కుళ్ళు కునేలా చేస్తున్నాడు.

 కాగా ఇటీవల సాధించిన డబుల్ సెంచరీలో ఏకంగా 17 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం గమనార్హం. అయితే ఇక ఈ రెండు డబుల్ సెంచరీలతో ఒక ప్రత్యేకమైన క్లబ్ లోకి అడుగుపెట్టాడు జగదీషన్. రాంజీ ట్రోఫీ సీజన్లో  తమిళనాడు నుంచి కనీసం రెండు డబుల్ సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. అతనికంటే ముందు డబ్ల్యూవి రామన్ 1988 -89 సీజన్లో మూడు డబుల్ సెంచరీలు. అదే సమయంలో 1991 - 92 లో రామన్ రెండు డబుల్ సెంచరీలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: