తప్పు చేసింది.. అందుకే పాక్ ఫలితం అనుభవిస్తుంది : భజ్జీ

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్ లను నియమించింది. అదే సమయంలో ఇక జట్టు సిబ్బంది అందరినీ కూడా తొలగించింది. మరీ ముఖ్యంగా విదేశీ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానంలో స్వదేశీయులను నియమించుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ చివరికి పాకిస్తాన్ ఆట తిరుగు అద్వానంగా మారిపోతుంది తప్ప ఎక్కడా మెరుగు అవడం లేదు. అయితే ఇదే విషయం గురించి భారత స్పిన్ దిగజం హార్బజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజాంను కెప్టెన్సీ నుంచి తొలగించడమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన అతిపెద్ద తప్పిదం అంటూ హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పాక్ క్రికెట్ ను వెనక్కి నెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్ తో పాటు పాకిస్థాన్లో కూడా క్రికెట్కు మంచి ప్రాముఖ్యత ఉంది.

 అయితే రెండు జట్లు తలబడినప్పుడు ఆటగాళ్లు రానిచకపోతే అది వారి కెరియర్ ఫై ప్రభావం చూపుతుంది. గతంలో ఎన్నోసార్లు అలాంటి ఘటనలు  జరిగాయ్. అయితే బాబర్ కెప్టెన్సీ మార్పు ఫై నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదని నేను అనుకుంటున్నా  ప్రపంచకప్ ఓవటములకు ప్రతిస్పందనగా తీసుకున్నట్లు అనిపించింది. అది మిమ్మల్ని మరింత వెనక్కినట్ట వచ్చు. ముందుకు కాకుండా వెనక్కి పురోగమించడానికి ఇది ఒక కారణం అంటూ అభిప్రాయపడ్డాడు. బాబర్ ప్రతిభవంతుడైన ఆటగాడు. కానీ ఒక్క ఆటగాడు వల్ల మాత్రమే జట్టు గెలవదు. మొత్తం జట్టు బాగా రానిస్తేనే గెలుస్తారు. సమిష్టి కృషి అవసరం అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: