నిజమే.. 2023 క్రికెట్ రారాజు కమిన్స్?

praveen
2023 ఏడాదిని ఎంతో గ్రాండ్గా ముగించుకుంది. ప్రపంచ క్రికెట్ ప్లేయర్లు ఇక ఇప్పుడు క్రికెట్ లోనే మునిగితేలుతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటి లాగానే 2023 ఏడాదికి గాను అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లకు ఇక ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రకటించడం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఐసీసీ ప్రకటిస్తున్న అవార్డుల నేపథ్యంలో ఎంతో మంది ప్లేయర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇటీవలే మూడు ఫార్మాట్ లలో కూడా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 ను ప్రకటించింది ఐసిసి. ఇక ఇందులో ఎక్కువగా 12 మంది టీమిండియా ప్లేయర్లకే చోటు దక్కటం గమనార్హం.

 అదే సమయంలో ఇక వరల్డ్ కప్ టైటిల్ గెలిపించిన ఫ్యాట్ కమీన్స్ ని కాదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టీం ఆఫ్ ది ఇయర్ జట్టుకు కెప్టెన్ గా నియమించి అరుదైన గౌరవం ఇచ్చింది అని చెప్పాలి. అదే సమయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏకంగా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా అవార్డును దక్కించుకున్నాడు. అయితే మూడు ఫార్మట్లు కలిపి ఇక ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది మాత్రం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్లాట్ కమిన్స్ అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది 3 ఫార్మట్ లలో కూడా అతను కెప్టెన్ గా ఆటగాడిగా కూడా సత్తా చాటాడు.

 ఎందుకంటే ఆస్ట్రేలియా క్రికెట్కు 2023 ఏడాదిని మరుపురాని ఏడాదిగా మార్చేశాడు ప్యాట్ కమిన్స్. అతని సారధ్యంలోని ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కూడా గెలుచుకుని రెండుసార్లు గత ఏడాది విశ్వవిజేతగా నిలిచింది. అదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఆసిస్ టెస్ట్ సిరీస్ ని కూడా డ్రాగా ముగించడంలో ఫ్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ ఆక్షన్ లో కూడా అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇలా 2023 ఏడాదిలో వరల్డ్ క్రికెట్లో హవా నడిపించాడు. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు లభించింది. కాగా అతనికి సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అని ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: