వారెవ్వా.. ఇలాంటి విక్టరీనే కదా టీమిండియా ఫ్యాన్స్ కు కావాల్సింది?

praveen
ప్రస్తుతం భారత సీనియర్ ప్లేయర్లందరూ కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు అడుతూ బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు దూసుకు వెళ్లడానికి ఇరు జట్లకు కూడా ఇది ఎంతో కీలకమైన టెస్టు సిరీస్ అని చెప్పాలి. ఇలా సీనియర్ ప్లేయర్లు టెస్ట్ సిరీస్ తో బిజీగా ఉంటే.. అటు యంగ్ టీమ్ ఇండియా వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. అయితే ఇక్కడ సీనియర్లు అదరగొట్టినట్టుగానే అక్కడ వరల్డ్ కప్ లోను కుర్రాళ్ళు కుమ్మేస్తున్నారు.

 ప్రతి మ్యాచ్ లోను అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రత్యర్థి పై పూర్తి ఫైచేయి సాధిస్తూ ఇరగదీస్తూ ఉన్నారు  ఈ క్రమంలోనే తాము భారత జట్టుకు ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని తమ ప్రదర్శనలతో నిరూపిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా యంగ్ ప్లేయర్లు రాణిస్తున్న తీరు చూసి ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. కాగా ఇటీవల అండర్ 19 టీమ్ ఇండియా మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది కదా మాకు కావాల్సింది అని భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా అనుకునే విధంగా ఘనవిజయాన్ని అందుకుంది.

 ఇటీవల జరిగిన మ్యాచ్లో ఏకంగా 21 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై ఘన విజయాన్ని అందుకుంది టీం ఇండియా. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 301 పరుగులు చేసింది. అయితే ముషీర్ ఖాన్ 106 బంతుల్లో 118 పరుగులు చేసి సూపర్ సెంచరీ తో చలరేగిపోయాడు. అయితే అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు భారత బౌలింగ్ విభాగం ముందు కుప్పకూలి పోయింది. చేదనలో కేవలం 100 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది  ఐర్లాండ్. కాగా ఈ టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: