సచిన్ రికార్డుకే ఎసరు పెట్టి.. చివరికి బ్రేక్ చేశాడుగా?

praveen
భారత్ క్రికెట్ లోనే కాదు వరల్డ్ క్రికెట్లో కూడా క్రికెట్ గాడ్ అనే పేరును సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి ఇక తక్కువ సమయంలోనే తాను లెజెండ్ అనే నిరూపించుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అంతర్జాతీయ క్రికెట్లో హవా నడిపించాడు సచిన్ టెండూల్కర్. ఇక భారత జట్టుకు ఎన్నో అద్వితీయమైన విజయాల్లో భాగంగా ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు అందరూ కూడా వణికిపోయే విధంగా ప్రస్థానాన్ని కొనసాగించాడు.

 ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్లో ఎవరు బ్రేక్ చేయలేనన్ని అద్భుతమైన రికార్డులు కూడా సచిన్ పేరిటే ఉన్నాయి. ఆయన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్న ఇంకా సచిన్ సాధించిన రికార్డులు పదిలంగా ఉన్నాయి అంటే ఆయన ఏ రేంజ్ రికార్డులను క్రియేట్ చేసి పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డును ఎవరైనా ఆటగాడు బద్దలు కొట్టాడు అంటే అది ఆ ఆటగాడికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతూ ఉంటుంది. కాగా ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు.

 ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు జో రూట్. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 60 బంతుల్లో 29 పరుగులు చేశాడు రూట్. అయితే సచిన్ టెండూల్కర్ 32 మ్యాచులలో 2535 పరుగులు చేయగా.. రూట్ 25 మ్యాచ్లలోనే ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక తర్వాత స్థానంలో గవాస్కర్ 2448, కుక్ 2431, కోహ్లీ 1991 పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు జో రూట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: