ఇద్దరు జింబాబ్వే క్రికెటర్లపై నిషేధం.. ఇంతకీ ఏం చేశారో తెలుసా?

praveen
సాధారణం గా అంతర్జాతీయ క్రికెట్లో కెరియర్ ను సాఫీగా కొనసాగించాలి అనుకునే ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఐసీసీ నిబంధనలకు అనుగుణం గానే వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పాలి. పొరపాటున ఈగోకు పోయి ఐసీసీ నిబంధనలను ఉల్లంఘిస్తే చివరికి ఇక కెరియర్ ను చేజేతులారా పాడు చేసుకున్నట్టే అవుతుంది. అందుకే ఎంతో మంది ఆటగాళ్ళు అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ లలో కూడా కొనసాగేందుకు ఎప్పుడు ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఉంటారు. ఇక ఆట తీరును ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూనే ఉంటారు.

 కొంతమంది ప్లేయర్లు అయితే ఫిట్నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఫిట్నెస్ను కాపాడుకునే సమయం లో కొన్ని కొన్ని సార్లు నిషేధిత డ్రగ్స్  తీసుకుంటే తమ ప్రదర్శన మరింత అత్యుత్తమంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది ఆటగాళ్ళు. చివరికి ఇలాంటిది బయటపడి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకునేంతవరకు పరిస్థితి వెళ్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఇద్దరు జింబాబ్వే ఆటగాళ్ల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.

 ఏకంగా ఇద్దరు ప్లేయర్లపై జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇటీవల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. డోప్ పరీక్షల్లో పట్టుబడిన ఇద్దరు క్రికెటర్ల పై ఇలా కొరడా జలుపించింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆల్ రౌండర్లు వెస్లీ మదే వేరే, బ్రాండన్ మౌతాలపై నాలుగు నెలపాటు నిషేధం విధించింది. అంతేకాకుండా వీరి మూడు నెలల జీవితంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా రిహాబిలిటేషన్ లో ఉన్నారని గత కొన్ని నెలల నుంచి డ్రగ్స్ వాడటం మానేశారని.. అందుకే కొన్ని నెలలు మాత్రమే నిషేధం విధించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. కాగా జింబాబ్వే క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ఇద్దరి క్రికెటర్లకు ఊహించని షార్ట్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: