పుజారాను తీసుకోకపోవడానికి.. కారణం అదే : రోహిత్

praveen
భారత జట్టులోకి యువ ఆటగాళ్ల రాకతో కొంతమంది సీనియర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా గత కొంతకాలం నుంచి జట్టులో స్తానం దక్కించుకోలేకపోతున్న క్రికెటర్లలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయినా చట్టేశ్వర్ పూజార కూడా ఒకరు. టీమిండియా టెస్ట్ క్రికెట్ కి నయా వాల్ అనే గుర్తింపును సంపాదించుకున్న పూజార.. ఇక గత కొంతకాలం నుంచి జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇద్దరికీ చోటు దక్కలేదు. కనీసం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అయిన వీరిని జట్టులోకి తీసుకుంటారు అని ఎంతోమంది భావించారు. కానీ ఊహించని రీతిలో మరోసారి సెలెక్టర్లు ఇతన్ని పట్టించుకోలేదు. మరోసారి యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేశారు సెలెక్టర్లు. అయితే ఇలా చట్టేశ్వర్ పూజారను సెలెక్ట్ చేయకపోవడంపై ఇటీవల రోహిత్ స్పందించాడు. కోహ్లీ దూరం అవడంతో పూజార జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. ఇక ఈ విషయంపై రోహిత్ మాట్లాడాడు.

 అనుభవజ్ఞులైన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోవడం కష్టతరమైన విషయమే. అయితే వాళ్ళు జట్టుకు అందించిన విజయాలు సాధించిన పరుగులు వాళ్ల అనుభవాన్ని విస్మరించడం చాలా కష్టమే అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కానీ యువ ప్లేయర్లకు విదేశాల్లో కాకుండా అనుకూలమైన పరిస్థితుల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా కీలక నిర్ణయాలు తీసుకున్నాము అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఎవరికైనా టీమిండియా నుంచి అవకాశం తలుపు తట్టే ఛాన్స్ ఉందని.. ఫిట్నెస్ కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తే మళ్లీ జట్టులోకి తిరిగి రావచ్చు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ ఎంతల వివరణ ఇచ్చినప్పటికీ అటు పూజారా లాంటి అనుభవజ్ఞుడిని పక్కన పెట్టడం ముమ్మాటికి తప్పే అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: