షోయబ్ మూడో పెళ్లిపై.. ఆఫ్రిది ఏమన్నాడో తెలుసా?

praveen
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ఇటీవల మూడో పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియా లో ఎంత సంచలనం గా మారి పోయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. గతం లో భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ అయినా సానియా మీర్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్.  అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకో బోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

 అయితే ఈ ఇద్దరు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వేరువేరుగా హాజరవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పాలి. అయితే ఇక నిజం గానే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారా అనే విషయం పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇటీవల ఇదే విషయంపై సానియా మీర్జా క్లారిటీ ఇచ్చింది. షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే సానియా మీర్జా విడాకుల విషయం ప్రకటించిందో లేదో అంతలోనే షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.

 పాకిస్తాన్ కు చెందిన నటి అయిన సనా జావేద్ ను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమం లోనే అతని మూడో పెళ్లి కాస్త సోషల్ మీడియాలో హాయ్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకున్న విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షోయబ్ మాలిక్, సనా దంపతులకు శుభాకాంక్షలు. షోయబ్ ఇక ఈ భార్యతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న అంటూ షాహిద్ ఆఫ్రిది కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: