ఇంగ్లాండ్ దూకుడుగా ఆడితేనే మాకు మంచిది.. బుమ్రా కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అదే ఇంగ్లాండు జట్టుతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ గురించి. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతు టీమిండియా. అయితే గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్ లతో సత్తా చాటుతు అదరగొడుతుంది టీమిండియా. ఇక ఇంగ్లాండ్తో సిరీస్ లో కూడా ఘనవిజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు సాగాలి అంటే ఇక టీమిండియాకు ఈ టెస్టు సిరీస్ లో విజయం సాధించడం ఎంతో కీలకంగా మారబోతుంది.

 కాగా ఇక రేపటి నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం పైన ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

 అయితే ఇటీవల ఇదే విషయం గురించి ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ వారికి అలవాటైన రీతిలో దూకుడుగా ఆడితేనే తమకు మంచిది అంటూ బుమ్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. బ్యాట్స్మెన్ ఎంత దూకుడుగా ఆడితే అన్ని తప్పులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. క్రమం తప్పకుండా వికెట్లు పడేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. వారు దూకుడుగా ఆడే కొద్ది నాకు కుప్పలుగా వికెట్లు లభిస్తాయి అని నేను అనుకుంటాను. అందుకే ఇంగ్లాండ్ ఎటాకింగ్ గేమ్ ఆడితేనే మాకు మంచిది అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: