సానియా మీర్జా విడాకులకు.. అక్రమ సంబంధం కారణమా.. షాకింగ్ నిజం బయటికి?

praveen
భారత టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జా విడాకులు అంశం సోషల్ మీడియాలో ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించింది సానియా మీర్జా. ఈ క్రమంలోనే దేశాన్ని ఎదిరించి మరి అతన్ని పెళ్లి చేసుకుని పాకిస్తాన్లో సెటిల్ అయ్యింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అన్ని వదిలేసుకొని షోయబ్ మాలిక్ కోసం వెళ్ళిన సానియా మీర్జాకు చివరికి ఎంతో అన్యాయం జరిగింది. షోయబ్ మాలిక్ ఇటీవల సానియా మీర్జాకు విడాకులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి. అంతే కాదు విడాకులు ఇచ్చాడో లేదో ఏకంగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు.

 అయితే గత కొంతకాలం నుంచి సానియా షోయబ్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక మొన్నటికి మొన్న వారి కొడుకు ఫంక్షన్ లో కూడా ఎడమొహం పెడ మొహం అన్నట్లుగానే ఈ ఇద్దరు ఉన్నారు. ఇక పలు ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా కలిసి హాజరు కావట్లేదు. దీంతో విడాకుల అంశం తెరమీదికి వచ్చింది. అయితే ఇక ఈ విడాకుల విషయం నిజమే అని ఇటీవల వీరు క్లారిటీ ఇవ్వడంతో అందరికీ స్పష్టత వచ్చింది అని చెప్పాలి. అయితే షోయబ్ మాలిక్, సానియా మీర్జాలకు విడాకులు జరగడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం బయటికి రాలేదు. ఈ విషయంపై ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు.

 అయితే షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులకు కారణం ఇదే అంటూ పాకిస్తాన్ మీడియాలో ప్రచురితమైన ఒక విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ మోసం చేసినందుకే చివరికి వాళ్లు విడిపోవాల్సి వచ్చిందట. ఇటీవలే నటి సనా జావెద్ మూడో పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. అయితే గత మూడు ఏళ్ల నుంచి ఆమెను రహస్యంగా కలుస్తూ వచ్చాడట. ఇక ఇలా సనా జావెద్, షోయబ్ మాలిక్ మధ్య ఉన్న వివాహేతర సంబంధమే సానియా మీర్జా విడిపోవడానికి కారణమైందట. ఈ విషయంలో ఏకంగా షోయబ్ కుటుంబం సైతం సానియాకే మద్దతుగా నిలిచింది అని పాక్ మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: