పాక్ బ్యాటర్ కు షాక్.. ఎయిర్ పోర్టు నుంచి మళ్లీ వెనక్కి?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించినట్లుగానే ఇక అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రత్యేకంగా t20 టోర్నీలను నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అన్ని దేశాల స్టార్ క్రికెటర్లను కూడా ఈ టోర్నీలో భాగం చేస్తూ ఇక ఐపీఎల్ తరహాలో గుర్తింపును సంపాదించుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా బంగ్లాదేశ్ టి20 నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ టోర్నీలో ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా చాలామంది పాల్గొంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధపడిన ఓ పాకిస్తాన్ క్రికెటర్ కి ఇటీవల షాక్ తగిలింది.

 సాధారణంగా ఇలాంటి టీ20 టోర్నీలలో ఆడేందుకు ఇక ఆయా దేశాల క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ప్రతి ఒక్క ఆటగాడు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి నో అబ్జెక్షన్  లెటర్ వచ్చిన తర్వాతే ఆయా టి20 టోర్నీలలో భాగం కావాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు వెళ్లిన పాకిస్తాన్ ఆటగాడు హరీష్ మహమ్మద్ కి చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు వెళ్లిన హరీష్ మహమ్మద్ చివరికి ఉన్నఫలంగా మళ్ళీ పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్ ఎక్కి స్వదేశానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు అని చెప్పాలి.

 బ్యాక్ టు హోం అనే ఒక ట్యాగ్ పెట్టి తన లగేజీ బ్యాగులను మళ్లీ వెనక్కి తీసుకువెళ్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో హరీష్ మహమ్మద్ చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరఫున ఆడాల్సి ఉంది. కానీ అతను ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ  లీగులు ఆడాడని మూడో లీగ్ ఆడేందుకు నిబంధనలు ఒప్పుకోవని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  అతనికి ఇక బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు ఎన్ఓసి ఇవ్వలేదు కాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిబంధనలో ప్రకారం ఆదేశ కార్యకర్తలు కేవలం రెండు విదేశీ లీగ్ లలో ఆడేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: