కోచ్ గా పని చేయొచ్చు.. కానీ కెప్టెన్ గా పనికిరాను.. ఇదెక్కడి వింత : వార్నర్

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగిన డేపిడ్ వార్నర్.. ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజులపాటు ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆసామాన్యమైన సేవలు అందించిన వార్నర్ టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ నుంచి కూడా వీడ్కోలు పలికాడు. అయితే కేవలం టి20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతాను అంటూ తెలిపాడు. ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ తర్వాత అతను ఇక  పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది అని చెప్పాలి.

 అయితే డేవిడ్ వార్నర్ కెరియర్ లోకి తొంగి చూస్తే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఎన్నో అరుదైన రికార్డులు కూడా తారసపడుతూ ఉంటాయి. అదే సమయంలో ఇక డేవిడ్ వార్నర్ కు నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఒక చేదు అనుభవం కూడా అతని కెరియర్ లో ఉంది అన్న విషయం తెలిసిందే. అదే బాల్ టాంపరింగ్ వివాదం ఏకంగా బాల్ టాంపరింగ్ తర్వాత డేవిడ్ వార్నర్ కెరియర్ లో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దాదాపు రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు  అంతేకాదు క్రికెట్ ఆస్ట్రేలియా అతనిపై జీవితకాల కెప్టెన్సీ నిషేధం కూడా విధించింది అని చెప్పాలి.

 అయితే ఈ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయాలి అంటూ ఎన్నో సార్లు డేవిడ్ వార్నర్ రిక్వెస్ట్ చేసిన అటు క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం పట్టించుకోలేదు. ఇక ఇదే విషయంపై ఎన్నోసార్లు వార్నర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ నిషేధం ఒక వింత. నేను కావాలనుకుంటే కోచ్గా పని చేయొచ్చు. కానీ కెప్టెన్ గా మాత్రం నా పైన నిషేధం. కెప్టెన్ కంటే కోచ్ నే కదా కీలకం.. ఈ ప్రశ్నకు ఇంకా నాకు జవాబు దొరకలేదు అంటూ డేవిడ్ వార్నర్  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా అది వైరల్ గా మారిపోయింది. కాగా ఇలా కెప్టెన్సీ నిషేధం విధించడం కారణంగా అతను జట్టులో సీనియర్ అయ్యుండి కెప్టెన్సీకి అర్హుడు అయినప్పటికీ కూడా ఇక సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని మాత్రం దక్కించుకోలేకపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: