ఇంగ్లాండ్ ఆటలు.. ఇండియాలో సాగవు : భజ్జీ

praveen
ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉన్న భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఇక ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ ఫార్మాట్ లో సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుబోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ కోసమే ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో మంచి పొజిషన్ సంపాదించడానికి జరగబోయే టెస్టు సిరీస్ లో విజయం సాధించడం అటు భారత జట్టుకు ఎంతో కీలకంగా కాబోతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయం అనేది అర్థమవుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు ఎలా రాణిస్తారు అనే విషయం పైన ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇలా ఎంతో మంది మాజీ ప్లేయర్లు చెబుతున్న రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో బజ్ బాల్ అనే కొత్త విధానంతో ఎటాకింగ్ గేమ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.

 కాగా ఇంగ్లాండ్ టీం ఎటాకింగ్ గేమ్ గురించి ఇటీవల ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ దూకుడు పనిచేయదు అంటూ హర్భజన్ సింగ్ తేల్చి చెప్పాడు. ఇక్కడ పరిస్థితులు ఇంగ్లాండ్తో పోల్చి చూస్తే చాలా కఠినంగా ఉంటాయి. తొలి బంతి నుంచే స్పిన్ ఉంటుంది. టాస్ కూడా ఎంతో కీలకమవుతుంది. వికెట్ కు రెండు వైపులా స్పిన్ ఉంటుంది. అందుకే ఇంగ్లాండ్ బజ్ బాల్ ఎటాకింగ్ గేమ్ ఇక్కడ అస్సలు పనిచేయదు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇంగ్లాండ్ జట్టు ఇండియాతో టెస్ట్ సిరీస్ లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి ఎదుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: