భారీ సిక్సర్ బాదిన.. ధోని జట్టు బ్యాటర్?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో అటు t20 ఫార్మాట్కు ఆదరణ ఎంతలా పెరిగిపోతు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్లేయర్లు అందరూ కూడా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులందరికీ కావాల్సిన బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు టి20 ఫార్మాట్ లో కనిపిస్తూ ఉండడంతో ఇక మిగతా ఫార్మాట్ ల గురించి పట్టించుకోవడానికి కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు. అయితే ఇటీవల కాలంలో వరల్డ్ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు.

 ఈ క్రమంలోనే టీ20 టోర్నీలను ప్రారంభించి సరికొత్తగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి 2008లోనే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఒక టి20 ప్రారంభించగా.. ఈ టోర్నీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక తర్వాత బీసీసీఐ ని చూసి మిగతా దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇలాంటి టి20 టోర్నిలు ప్రారంభిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున ప్రాతినిథ్యం వహించిన ఎంతోమంది ఆటగాళ్లు ఆయా టి20 లలో కూడా అదరగొడుతూ ఉండడంతో ఇక ఆ ప్లేయర్ల ప్రదర్శన గురించి ఇండియాలో కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ మోయిన్ అలీ ఇటీవల సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో చెలరేగిపోయాడు.

 అతను బంతితో మ్యాజిక్ చేయడమే కాదు బ్యాట్ తో కూడా వీర విహారం చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. భారీ సిక్సర్లు బాదుతూ బౌలర్లను వనికిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఓ భారీ సిక్సర్ బాదుతూ ప్రిటోరియస్ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు బౌలర్ వెల్జోయెన్ వేసిన 16 ఓవర్లో మోయిన్ అలీ దాటికి బంతి ఏకంగా స్టేడియం పైకప్పుపై పడింది అని చెప్పాలి. 103 మీటర్ల  దూరంలో పడిన ఈ సిక్సర్ సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లోనే  రెండవ భారీగా సిక్సర్ గా రికార్డు సృష్టించింది. కాగా ఈ మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: