అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్.. వాళ్లంతా ఫ్రీగా చూడొచ్చు?

praveen
గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత అటు భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో రాణించినట్లుగానే ద్వైపాక్షిక సిరీస్లలో కూడా అదరగొడుతూ ఉంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుసగా సిరీస్ లను కైవసం చేసుకుంటుంది టీమ్ ఇండియా. ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో  మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడి 3-0 తేడాతో ఆఫ్గనిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేసింది.

 అయితే ఇక ఇప్పుడు మరో కీలకమైన ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీం ఇండియా. ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక దేశంలోని వివిధ వేదికలపై ఈ టెస్ట్ మ్యాచ్ లు జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడంతో అత్యుత్తమమైన క్రికెట్ ను చూసే అవకాశం ఉందని ఎంతమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాగా మొదటి మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25వ తేదీన జరగబోతుంది.

 ఈ క్రమంలోనే ఈ టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే ఇక టికెట్ల విక్రయం కూడా మొదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. తొలి టెస్ట్ కు విద్యార్థులు అందరికీ కూడా ఉచిత ప్రవేశం కల్పించబోతున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ విషయాన్ని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వెల్లడించారు. ఫ్రీ ఎంట్రీ కోసం పాఠశాల యాజమాన్యాలు హెచ్సిఏ కి లెటర్ పంపాలి. రోజుకు 5000 మందికి ఫ్రీ ఎంట్రీ తో పాటు ఫుడ్ కూడా అందిస్తాం. 26న ఆర్మీ జవాన్లు వారి కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా మ్యాచ్ చూడవచ్చు అంటూ హెచ్సిఏ ప్రకటన చేసింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: