పాక్ జట్టుకు బిగ్ షాక్.. ఆయన కూడా చేతులెత్తేసారు?

praveen
భారత్ దాయాది దేశంగా కొనసాగుతున్న పాకిస్తాన్.. రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో మరింత నిండా కోరుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వాలు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. చివరికి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో ఇతర దేశాలు అప్పులు ఇస్తాయేమో అని ఆశగా చేయి చాచడం తప్ప పాకిస్తాన్ కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయితే అచ్చం దేశం సంక్షోభంలో కూరుకుపోయినట్లుగానే ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ కూడా సంక్షోభంలో కూరుకుపోబోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవును అని సమాధానం చెబుతున్నారు అందరూ.

 ఎందుకంటే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టుకు క్రికెట్ బోర్డు అధ్యక్షులు తరచూ మారుతూనే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. తర్వాత రమిజ్ రజా ఇలా క్రికెట్ బోర్డు అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. కానీ ఆ తర్వాత ఊహించని రీతిలో అతన్ని పక్కనపెట్టి జాకా ఆశ్రఫ్ చేతిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష బాధ్యతలను పెట్టారు. అయితే ఇక అతను అధ్యక్షుడిగా మారిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన మార్పులు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో పాక్ జట్టు వరుసగా విఫలం అవుతూనే ఉంది. ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రమే కాదు ఆసియా కప్,  ప్రపంచ కప్ లాంటి బడా టోర్నిలలో కూడా పాకిస్తాన్ జట్టు ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి.

 ఇలా వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో పడిపోతున్న పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఒక భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా కొనసాగుతున్న జాకా ఆశ్రఫ్ ఇటీవల రాజీనామా చేశారు. గత ఏడాది చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆశ్రఫ్ పాకిస్తాన్ క్రికెట్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆయన హయాంలోనే ఆసియా కప్ వన్డే ప్రపంచ కప్ లాంటి టోర్నీలలో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. అయితే పాకిస్తాన్ జట్టును గాడిలా పెట్టాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత విధానంలో అది సాధ్యం కాదు అంటూ జాకా ఆశ్రఫ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: