షాకింగ్ : కెప్టెన్సీకి గుడ్ బై చెప్పుబోతున్నాడు?

praveen
బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లుగానే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా దేశీయ టి20 లీగ్లను నిర్వహిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది బిగ్ బాష్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఐపీఎల్ తరహా లోనే జరిగే ఈ లీగ్ లోఒక భారత క్రికెటర్ల మినహా మిగతా అన్ని దేశాలకు క్రికెటర్లు కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాష్ లీగ్ లో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ చేస్తున్న అద్భుతమైన ప్రదర్శనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతోమంది భారత ఆటగాళ్లు వివిధ టీమ్లకు కెప్టెన్లుగా కొనసాగినట్లుగానే అటు బిగ్ బాష్ లీగ్ లో కూడా చాలామంది ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆయా జట్లకు సారదులుగా బాధ్యతలు చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియా జట్టులో విధ్వంసకర ఆల్రౌండర్ గా పేరుగాంచిన మ్యాక్స్ వెల్ మెల్బోర్న్  స్టార్స్ జట్టుకి కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే అతను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఏకంగా అతనికి కెప్టెన్సీ లోనే మేల్ బోర్న్ స్టార్స్ జట్టు ఏకంగా రెండు సార్లు ఫైనల్ వరకు వెళ్ళింది.

 కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది అని చెప్పాలి. రెండుసార్లు ఫైనల్ వరకు వెళ్లిన చివరి అడుగులో బోల్తా పడింది. చివరికి కేవలం రన్నరప్ తో మాత్రమే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇక మేల్ బోర్న్ స్టార్స్ జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న మ్యాక్స్ వెల్ ఇప్పుడు కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. బిబిఎల్ సీజన్ 8 నుంచి ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మాక్సి ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాడు. ఈ ఏడాది ఆరో స్థానంలో జట్టు నిలిచింది. ఇలా వరుస వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్సీ ని వదులుకునేందుకు మాక్స్ వెల్ సిద్ధమయ్యాడట. ఇప్పటికే జట్టు యాజమాన్యానికి సమాచారం అందించాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: