పాండ్యకు ఊహించని షాక్.. ఇన్నాళ్లకు గట్టి పోటీ ఎదురైందిగా?

praveen
ఈ ఏడాది  టి20 వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ టోర్నీ యూఎస్ తో పాటు వెస్టిండీస్ వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈసారి వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది టీమ్ ఇండియా. అయితే ఒక విషయం మాత్రం భారత జట్టుకు ఆందోళనకరంగా మారిపోయింది. ఎందుకంటే భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గాయపడిన పడ్డాడు. ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో ఇలా గాయం బారిన పడ్డాడు హార్థిక్.

 ఇక ఆ తర్వాత టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్నప్పటికీ అతను గాయం అంచు కోలుకోకపోవడంతో  అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి.ఇక ఎప్పుడు గాయాల బారిన పడతాడో అన్న విషయం కూడా తెలియట్లేదు. అయితే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ లేకుండా టీమిండియా వరల్డ్ కప్ లో ఎలా రాణించగలదు అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే భారత జట్టుకు మరో అదిరిపోయే ఆల్ రౌండర్ దొరికాడు అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది.

 ఇక ఈ టి20 సిరీస్ లో ఆల్ రౌండర్ శివం దూబే వీర విహారం చేస్తున్నాడు. తొలి టీ20 మ్యాచ్ లో 60 పరుగులతో చెలరేగిపోయిన శివం దూబే రెండో టి20 మ్యాచ్ లో 32 బంతుల్లోనే 63 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పాలి. అంతే కాదు బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం. దీంతో టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా లాంటి నయా ఆల్ రౌండర్ దొరికేసాడు అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ లో అతని జట్టులోకి తీసుకోవాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. మాటిమాటికి హార్దిక్ గాయాల బారిన పడుతున్నాడని.. అందుకే శివం దూబేకు జట్టులో చోటు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: