లంక క్రికెట్ బోర్డుకి.. ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

praveen
గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన శ్రీలంక జట్టు ఎంత దారుణమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి టీమ్స్ కి ఎక్కడా పోటీ ఇవ్వలేక డీలా పడిపోయింది శ్రీలంక టీం. ఈ క్రమంలోనే వరుస ఓటములతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆట తీరుతో శ్రీలంక ఏ వరల్డ్ కప్ ను గెలవలేదు అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు. అయితే శ్రీలంక టీం వరల్డ్ కప్ నుండి అర్ధాంతరంగా  నిష్క్రమించి స్వదేశానికి చేరుకుందో లేదో అంతలోనే ఐసిసి ఇక ఆ దేశ క్రికెట్ బోర్డ్ కు షాక్ ఇచ్చింది.

 ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ బోర్డు వ్యవహారాలలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ కావడం కారణంగానే ఇక ఇలా క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది ఐసిసి. కాగా బోర్డు అధికారుల విజ్ఞప్తి మేరకే ఇలా బ్యాన్ విధించింది అన్నది తెలుస్తుంది. అయితే ఇలా ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ మరింత సంక్షోభంలో కోరుకుంది. ఇలాంటి సమయంలో మరి కొన్ని రోజుల్లో లంక క్రికెట్ బోర్డుకు ఐసిసి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్నది తెలుస్తుంది.

 శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు ఐసీసీ యోచిస్తుంది అన్నది తెలుస్తుంది. తాజాగా ఐసీసీ బృందం శ్రీలంకలో పర్యటించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం లేకుండానే చూస్తామని ప్రధాని విక్రమ సింగే ఐసీసీ సీఈవో జఫ్ అల్లాడిస్ కు హామీ ఇచ్చారు. ఈ నేపద్యంలోనే త్వరలో సస్పెన్షన్ ఎత్తివేత పై నిర్ణయం ఉంటుంది అని తెలుస్తుంది. అయితే వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా సరైన ఆటగాళ్లని జట్టులోకి తీసుకోలేదు అంటూ తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చాయి. ఇక జట్టు సెలక్షన్ సరిగ్గా లేకపోవడంతోనే వరల్డ్ కప్ లో లంక జట్టు విఫలమైంది అంటూ అందరూ ఆరోపణలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: