టీమిండియాలో ఆ ముగ్గురు ఉంటే చాలు.. వరల్డ్ కప్ మనదే : రైనా

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న టీమ్ ఇండియాకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి వరల్డ్ కప్ టోర్నీలో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి భారత జట్టు ఇక లీగ్ మ్యాచ్లో అదరగొట్టేస్తుంది. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం తడబడుతూ చివరికి ఓటమితో నిరాశ పరుస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. సెమీఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోయింది టీమిండియా.
 టీమిండియా జోరు చూస్తే తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ గెలుస్తుందని.. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందని అందరూ అనుకున్నారు. కానీ కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబాటుకు గురి అయింది టీమిండియా. దీంతో ఓటమితో రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఇక మరోసారి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అన్న కల కలగానే మిగిలిపోయింది. అయితే ఏడది టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ లో గెలవడమే లక్ష్యంగా భారత జట్టు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేయాలని ఆరాటపడుతుంది అని చెప్పాలి.

 ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ప్లేయర్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది జరగబోతున్న t20 ప్రపంచ కప్ లో భారత్కు ముగ్గురు ఆటగాళ్లు కీలకం అవుతారు అని మాజీ క్రికెటర్ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతోపాటు గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంతు జట్టులో ఉంటే చాలు అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ వన్ డౌన్ లోనే బ్యాటింగ్కు రావాలి అంటూ సూచించాడు. దూకుడుతో పాటు నిలకడగా ఆడటం కూడా చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: