వార్నర్ గొప్ప క్రికెటరేమీ కాదు.. ఆసీస్ మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు?

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగిన సీనియర్ ఆటగాడు డేవిడ్ వార్నర్.. ఇటీవల తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి వార్నర్ రిటైర్మెంట్ గురించి వార్తలు రాగా.. ఇక ఇటీవల అతను అఫీషియల్ గా టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తనకు చివరి టెస్ట్ అంటూ ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్ చెప్పినట్లుగానే చివరికి టెస్టులకు గుడ్ బై చెప్పేసాడు అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ ముగియకముందే వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

 ఈ క్రమంలోనే అతను ప్రస్తుతం కేవలం టి20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులను, అతని అద్భుతమైన ఇన్నింగ్స్ లను కొనియాడుతూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అటు ఆస్ట్రేలియ జట్టుకి పెద్ద లోటు లాంటిదే అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్ మాత్రం డేవిడ్ వార్నర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇటీవల వన్డేలకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ పై ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరియర్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడు. వందకు పైగా టెస్ట్ మ్యాచ్లు 160 కి పైగా వన్డే మ్యాచ్లు, ఇక 100కు పైగా టి20 మ్యాచ్లు ఆడాడు డేవిడ్ వార్నర్. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. అయితే డేవిడ్ వార్నర్ గొప్ప క్రికెటర్ ఏమీ కాదు. గ్రేట్ అఫ్ ది గేమ్ గా అతని అభివర్ణించలేం. బ్రాడ్మన్, మెక్ గ్రత్, షేన్ వార్న్ మాత్రమే గ్రేట్ అంటూ ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుఖానన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: