2023 ఏడాదిలో.. గ్రేటెస్ట్ నాక్ అదేనట?

praveen
2023 ఏడాది ముగిసింది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను కూడా మిగిల్చిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ 2023 ఏడాదిలో ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా జరిగింది. ఇక దీంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది అని చెప్పాలి. ఆయా కీలక టోర్నిలలో కొంతమంది ప్రేక్షకులకు ఆశించిన ఫలితాలు వచ్చి సంతోషంలో మునిగిపోతే.. ఇంకొంతమంది ప్రేక్షకులకు మాత్రం ఇక తమ అభిమాన జట్టు గెలవలేక నిరాశ మిగిలిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు 2024లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇక గత సంవత్సరం మిగిల్చిన చేదు అనుభవాలను మధుర జ్ఞాపకాలను కూడా ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో క్రికెట్ విశ్లేషకులు సైతం ఇక గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఎవరు? ఇక ఏడాది మొత్తంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఏంటి అనే విషయాన్ని కూడా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో మ్యాక్స్ వెల్ సాధించిన డబుల్ సెంచరీని ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేదు. ఒకవైపు కాలి గాయం వేదిస్తున్న ఏకంగా మహావీరుడు లాగా పోరాటం కొనసాగించాడు మ్యాక్స్ వెల్.

 జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ (201) ఇన్నింగ్స్ 2023 ఏడాది లోనే గ్రేటెస్ట్ నాక్ అని విజ్నడ్ ప్రకటించింది. కాగా గత ఏడాది  వరల్డ్ కప్ లో ఆఫ్గనిస్తాన్ పై మాక్స్ డబుల్ సెంచరీ తో విరుచుకుపడ్డాడు. 21 ఫోర్లు, పది సిక్సర్లతో  అజెయ ద్వీశతకం సాధించాడు. కండరాలు పట్టేసిన అతను మాత్రం వీరోచితమైన బ్యాటింగ్ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: