ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ రియాక్షన్ వైరల్?

praveen
ప్రస్తుతం భారత్ సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. ఆతిథ్య సఫారి జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ముగించుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో తలబడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో నమోదు అవుతున్న గణాంకాలు చూసి అటు క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ రెండో టెస్టు మ్యాచ్ ఏకంగా చెత్త రికార్డులకు వేదికగా మారిపోయింది. రెండు జట్లు కూడా అత్యంత పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులను మూటగట్టుకుంటున్నాయి అని చెప్పాలి.

 పేస్ బౌలర్లకు కేఫ్ టౌన్ పిచ్ బాగా సహకరిస్తూ ఉండడంతో ఇక ఇరు జట్ల బ్యాట్స్మెన్లు ఫేస్ బౌలింగ్ ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు. చివరికి పరుగులు కూడా చేయలేక.. వికెట్ సమర్పించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆల్ అవుట్ అయి అందరిని ఆశ్చర్యపరిచి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత 153 పరుగులు చేసిన భారత జట్టు కాస్త కుదురుకున్నట్లు కనిపించినప్పటికీ.. ఇక చివర్లో ఏకంగా 11 బంతుల్లో ఆరు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా అందరినీ షాక్ లో ముంచేసింది అని చెప్పాలి.

 టీమిండియా ఆల్ అవుట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలా కేవలం ఒకేరోజు ఇరు జట్ల పేసర్లు 23 వికెట్లు సాధించారు. అయితే ఇదే విషయంపై స్పందించిన క్రికెట్ దిగజం సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకేరోజు 23 వికెట్లతో ఈ ఏడాది ప్రారంభమైంది. ఇది నిజంగా జరిగినట్టు అనిపించడం లేదు. నేను సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయినప్పుడు ఫ్లైట్ ఎక్కాను. ఇక ఇప్పుడు ఫ్లైట్ దిగి ఇంటికి చేరుకొని.. టీవీ పెట్టి చూసేసరికి సౌత్ ఆఫ్రికా మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మధ్యలో నేను ఏం మిస్ అయ్యాను అంటూ పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: