వార్నర్ క్యాప్ కోసం.. డిటెక్టివ్ లను రంగంలోకి దింపండి : పాక్ కెప్టెన్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన టెస్ట్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తనకు కెరియర్ లో చివరి టెస్ట్ అంటూ ఇప్పటికే ప్రకటించేశాడు. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి ఊహించిన రీతిలో చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా అతని బ్యాక్ ప్యాక్ చోరీకి గురైంది. ఇక అందులో అతనికి ఎంతో సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే గ్రీన్ క్యాప్ కూడా ఉండడం గమనార్హం.

 ఈ క్రమంలోనే మేల్ బోర్న్ నుంచి సిడ్నికి వస్తూ ఉన్న సమయంలో ఎవరో తన బ్యాక్ ప్యాక్ కొట్టేశారు అంటూ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు  అంతేకాకుండా అందులో తనకు ఎంతో సెంటిమెంట్ గా భావించే గ్రీన్ క్యాప్ కూడా చోరీకి గురైంది అంటూ తెలిపాడు. ఇక ఇలా దానిని దొంగలించిన వారు ఎవరైనా సరే తిరిగి ఇచ్చేయాలని వారికి కొత్త బ్యాక్ ప్యాక్ కొనిస్తాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు డేవిడ్ వార్నర్  అయితే ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  డేవిడ్ వార్నర్ పోగొట్టుకున్న బ్యాక్ బ్యాక్ కనుగొనడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సహాయ పడాలని విజ్ఞప్తి చేశాడు.

 వెంటనే ఆస్ట్రేలియా ప్రభుత్వం డిటెక్టివ్లను రంగంలోకి దించి దేశం మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలి అంటూ షాన్ మసూద్ కోరాడు. వార్నర్ గొప్ప ఆటగాడు  అలాంటి ఆటగాడు తన క్రికెట్ కెరియర్లు ఆఖరిలో  సరైన గౌరవం పొందాలి. అతని బ్యాక్ ప్యాక్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశమంతా గాలింపు చర్యలుచేపట్టాలి. అత్యుత్తమ  డిటెక్టివ్ లను రంగంలోకి దించాలి. ఏ క్రికెటర్ కైనా ఇది అత్యంత విలువైన సమయం. అతని క్యాప్ తిరిగి దక్కుతుందని నేను ఆశిస్తున్నాను అంటూ షాన్ మసూద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: