REWIND 2023 : ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు కొట్టిన.. టాప్ 5 బ్యాట్స్మెన్లు వీళ్లే?

praveen
మరికొన్ని గంటల్లో ప్రపంచం మొత్తం 2024 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది. ఈ క్రమంలోనే 2023 ఏడాది మిగిల్చిన మధుర జ్ఞాపకాలను ఎన్నో అనుభవాలను కూడా ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక క్రికెట్ నే ప్రాణంగా బ్రతికే ప్రేక్షకులు ఇక ఈ ఏడాది క్రికెట్లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను మరోసారి పాత రోజుల్లోకి తొంగి చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే  2023 ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్లు ఎవరు అన్న చర్చ కూడా తెరమీదకి వస్తుంది. ఆ వివరాలు చూసుకుంటే..
 మహమ్మద్ వసీం జూనియర్ : పసికూనా టీం అయిన యూఏఈ లో కొనసాగుతున్న ఈ ఆటగాడు.. 2023 ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఏకంగా 98 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి. మొత్తంగా 46 మ్యాచ్లు ఆడి 1592 పరుగులు చేశాడు. ఇందులో 141 ఫోర్లు 98 సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి.

 రోహిత్ శర్మ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2023 ఏడాది మొత్తంలో 35 మ్యాచ్లలో 1800 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు 14 అర్థ సెంచరీలు ఉండగా.. 191 ఫోర్లు 80 సిక్సర్లు ఉన్నాయి.

 కుషాల్ మల్ల  : నేపాల్ ప్లేయర్ కుశాల్ మల్లా 2023 ఏడాది మొత్తంలో 65 సిక్సర్లు బాదాడు. ఏడాదిలో 34 మ్యాచ్లు ఆడిన ఈ ప్లేయర్ 951 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 65 సిక్సర్లతో పాటు 70 ఫోర్లు కొట్టాడు ఈ బ్యాట్స్మెన్.

 మిచెల్ మార్ష్ : ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ ఏడాది ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 61 సిక్సర్లు కొట్టి ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెలలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 33 ఇన్నింగ్స్ లో 1584 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ మూడు సెంచరీలు నాలుగు అర్ద సెంచరీలు కొట్టాడు.
 డారిల్ మిచెల్  : న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారెల్ మిచెల్ అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టాడు. ఏకంగా 54 ఇన్నింగ్స్ లలో ఆరు సెంచరీలు 9 అర్థ సెంచరీలతో 1988 పరుగులు చేశాడు. ఇక అతని ఇన్నింగ్స్ లలో 148 ఫోర్లు 61 సిక్సర్లు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: