స్టేడియంలోనే దుకాణం పెట్టేసిన లవర్స్.. వీడియో వైరల్?

praveen
సాధారణంగా ప్రేమలో మునిగి తేలుతున్నవారు ఈ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు అనే ఒక మాట ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రేమలో మునిగి తేలుతున్న ఎంతోమంది యువతి యువకులు పబ్లిక్ తో పని లేకుండా రెచ్చిపోతున్నారు. పార్క్ లు, బస్ స్టాప్ లు, రైల్వే స్టేషన్లు అనే తేడా లేకుండా ప్రతిచోట ఏకంగా రొమాన్స్ లో మునిగి తేలిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి.


 చుట్టూ అంతా జనాలు ఉన్నారు. ఇక వాళ్ల ముందు ఇలా రొమాన్స్ లో మునిగిపోతే పరువు పోతుంది అని ఎక్కడా ఆలోచించడం లేదు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లలో ఏకంగా రొమాన్స్ తో రెచ్చిపోతున్న లవర్స్ ఇటీవల కాలంలో చాలా మంది కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏకంగా ఇద్దరు లవర్స్ క్రికెట్ స్టేడియంలో దుకాణం పెట్టేసారు. ఆ స్టేడియంలో తక్కువ మంది ప్రేక్షకులు ఉన్నారు. దీంతో తమను ఎవరు గమనిస్తారులే అని ఏకంగా రొమాన్స్ లో మునిగి తేలారు. కానీ కెమెరా వారిని కంట కనిపెట్టేసింది. దీంతో కెమెరా కంటికి చిక్కిన వారు పెద్ద స్క్రీన్ లో ప్రత్యక్షమయ్యారు.


 దీంతో అప్పటికే రొమాన్స్ లో మునిగి తేలిన జంట.. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. దీంతో ప్రియుడు సిగ్గుపడుతూ ముఖాన్ని టవల్తో దాచుకోగా.. ఆ యువతి మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండిపోయింది. ఈ ఘటన మేల్ బోర్న్ వేదికగా జరిగింది అనేది తెలుస్తోంది  ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. మేల్ బోర్న్ స్టేడియంలో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా ప్రేక్షకులు పెద్దగా లేరు. అదే అదునుగా భావించిన ఓ ప్రేమ జంట రాసలీలల్లో మునిగి తేలింది. ప్రేక్షకులు లేని గ్యాలరీలోకి వెళ్లిన కూర్చున్న జంట ఏకంగా రొమాన్స్ లో మునిగి తేలింది. దీంతో కెమెరామెన్ ప్రత్యేకంగా వారిని ఫోకస్ చేయడంతో ఏకంగా బిగ్ స్క్రీన్ లో వాళ్లు కనిపించారు. ఇది చూసి ఒక్కసారిగా ఆ లవర్స్ షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: