వారణాసి సినిమాకు షాక్ ఇచ్చిన అధికారులు.. ఎందుకంటే..?

Divya
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,డైరెక్టర్ రాజమౌళి , ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే భారీగా అంచనాలు ఏర్పడ్డ ఇప్పటికే 50% వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 ఈ సినిమాని పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు గతంలో ఎన్నడు లేని విధంగా కటోర శ్రమ చేస్తున్నారు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి జర్మనీకి వెళ్లారు. అయితే తదుపరి నెక్స్ట్ షెడ్యూల్ అండర్ వాటర్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకోసం దాదాపుగా 150 ట్యాంకర్ల నీరు అవసరం ఉన్నది. ఇందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ బోర్డుని కూడా చిత్ర బృందం రిక్వెస్ట్ చేసిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందుకు అయ్యే ఖర్చు కూడా తాము భరిస్తామని చెప్పిన ప్రస్తుతం సమ్మర్ కావడం చేత హైదరాబాదులో నీటి కొరత చాలా ఎక్కువగా ఉందని దీంతో ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని ఈ పని చేయలేమని అత్యవసరాలకే ముందు వాటర్ సప్లై చేస్తామని తెలిపారు.


దీంతో నీళ్లను సప్లై చేయలేమని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులు వారణాసి చిత్ర బృందానికి తెలిపారట. దీంతో వారణాసి టీమ్ ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది ఇప్పుడు వాటర్ దొరక్కపోతే ప్లాన్ చేసిన షూటింగ్ ఆగిపోతుంది. అలాగే షెడ్యూల్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ షెడ్యూల్ ని రాజమౌళి పోస్ట్ ఫోన్ చేసి వేరే సీన్స్ ఏదైనా ప్లాన్ చేస్తారా లేకపోతే వాటర్ ఎక్కడి నుంచైనా తెప్పిస్తారా? అనే విషయం ఇప్పుడు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: