టాలీవుడ్: 1993 అనేది హిస్టరీలోనే స్పెషల్ ఎందుకంటే..?
సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబుతో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఏఎన్ఆర్ కలిసి నటించిన చిత్రం మెకానిక్ అల్లుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పరాజయం అయ్యింది.
సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన వారసుడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు, సుమన్ కలయికలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం బావ బావమరిది.
అయితే ఈ జోనల్లో బాలకృష్ణ ,రాజశేఖర్ మాత్రం ఈ అవకాశాలను మిస్ చేసుకున్నారు. ఒకవేళ వీరు కూడా ఏదో ఒక సినిమాలలో కనిపించి ఉంటే 1993 అనేది ఇంకా అద్భుతమైన సంవత్సరం గా ఉండేది.
సీనియర్ స్టార్స్ తరువాతి జనరేషన్ స్టార్స్ తో కలిసి యాక్ట్ చేసిన ఏకైక సంవత్సరంగా 1993 మిగిలింది.
అలాగే హీరో వెంకటేష్, సుమన్ కలిసి నటించిన కొండపల్లి రాజా, సుమన్ సురేష్ నటించిన పరువు ప్రతిష్ట సినిమా కూడా 1993న విడుదలయ్యింది.
ఇలా 1993 మాత్రం మల్టీ స్టార్ నామ సంవత్సరంగా టాలీవుడ్ మిగిలిపోయింది. వీటికితోడు అందరికీ మంచి హిట్ ఇచ్చిన స్పెషల్ ఇయర్ గా కూడా మిగిలింది.