మార్టిన్ గప్టీల్ కు అరుదైన గౌరవం.. ఏకంగా స్టేడియంకు అతని పేరు?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్రతి ప్లేయర్ కూడా అద్భుతంగా రానించాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ కాలం పాటు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెరియర్ను సాఫీగా కొనసాగించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఒకవైపు ఫిట్నెస్ ను కాపాడుకుంటూ మరో వైపు ఫామ్ ను కంటిన్యూ చేస్తూ ఉంటారు ప్లేయర్లు.


 అయితే ఇలా క్రికెట్ ఆటపట్ల నిబద్ధత తో కూడిన క్రికెటర్లే లెజెండ్స్ గా అవతరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఇలా ఒక టీం తరఫున ఎన్నో ఏళ్ల పాటు సేవలు చేసిన క్రికెటర్ కు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అరుదైన గౌరవాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏకంగా స్టేడియం లోని కొన్ని రాక్స్ కి ఆయా స్టార్ క్రికెటర్ల పేర్లు పెడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అయితే ఏకంగా స్టేడియం కే ఆటగాళ్ల పేరును పెడుతూ ఇలా జట్టు కోసం ఎంతో సేవ చేసిన ప్లేయర్లకు అరుదైన గౌరవం ఇస్తూ ఉన్నాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు.


 అయితే ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టీల్ కు కూడా ఇలాంటి ఒక అరుదైన గౌరవం లభించింది అన్నది తెలుస్తోంది. ఈడెన్ పార్క్ ఔటర్ ఓవల్ మైదానానికి ది మార్టిన్ గప్టీల్ ఓవల్ మైదానంగా నామకరణం చేశారు. న్యూజిలాండ్, ఆక్లాండ్ తరఫున గప్టీల్ చేసిన సేవలకు గాను ఇక ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది కివీస్ క్రికెట్ బోర్డు. కాగా మార్టిన్ గప్తిల్ 178 వన్డే మ్యాచ్లలో 7346 పరుగులు.. 122 టి20 లో 3531 పరుగులు, 47 టెస్ట్ మ్యాచ్లలో 2586 పరుగులు చేశాడు అని చెప్పాలి. అలాగే ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా తన ఆటతీరుతో బాగా దగ్గరయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: