ఇతను పక్షిరాజా ఏంటీ.. కళ్ళు చెదిరే క్యాచ్ పట్టిన సాయి సుదర్శన్?
అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో జట్టును గెలిపించేందుకు కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు ఎలాంటి విన్యాసాలు చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా ఊహించని రీతిలో ఉండే ఫీల్డింగ్ విన్యాసాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఎవరైనా ఆటగాళ్లు ఇలా ఏకంగా మెరుపు వేగంతో పరిగెడుతూ డ్రైవింగ్ క్యాచ్ పట్టాడు అంటే చాలు అతని గురించిన అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే సౌత్ ఆఫ్రికా తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్లో భారత యువ ఆటగాడు సాయి సుదర్శన్ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆవేశ్ ఖాన్ 32 ఓవర్ వేయగా.. రెండో బంతిని మిడ్ ఆఫ్ దిశగా ఆడాడు బ్యాట్స్మెన్ క్లాసేన్. అయితే ఈ సమయంలోనే మీడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ పక్షి లాగా ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో అక్కడున్న బ్యాట్స్మెన్ క్లాసేన్ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఇక కామెంటేటర్లు ఈ క్యాష్ ని క్యాచ్ ఆఫ్ ది సిరీస్ గా కూడా అభివర్ణించారు. కాగా వన్డే సిరీస్ లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది.