సినిమా సీన్ ను తలపించే క్రైమ్.. కొకైన్ ఎక్కడ దాచాడో తెలుసా?

praveen
సాధారణంగా సినిమాల్లో చూపించే సన్నివేశాలు నిజ జీవితంలో అస్సలు జరగవు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఏకంగా సినిమాలకు మించిన ఘటనలు కొన్ని కొన్ని సార్లు రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. సినిమాల్లో ఉండే మంచి విషయాలను పట్టించుకోవడం మానేసి ప్రేక్షకులు చెడు విషయాలకు మాత్రం బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక సినిమాలలో హీరో అక్రమాలకు పాల్పడ్డారు అంటే రియల్ లైఫ్ లో కూడా అది ప్రయత్నించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అయితే ఇక విదేశాల నుంచి ఏకంగా అక్రమంగా డ్రగ్స్ రవాణా చేయడానికి కొంతమంది ఏకంగా సినిమాలో చూపించిన రూట్స్ ని వాడుతూ ఉంటారు. హీరో సూర్య సినిమాలో ఏకంగా డ్రగ్స్ ని అక్రమ రవాణా చేయడానికి కొన్ని క్యాప్సిల్స్ గా మార్చి ఆ క్యాప్సిల్స్ ని ఏకంగా కడుపులోకి మింగి రక్రమ రవాణా చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమాను తలపించేలా ఒక సీన్ జరిగింది. దాదాపు రెండు కిలోల కడుపులో పెట్టుకున్నాడు ఒక వ్యక్తి. క్యాప్సిల్స్ రూపంలో కడుపులోకి మింగేసాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నైజీరియన్ పౌరుడు కొకైన్ ను కడుపులో దాచిపెట్టుకుని రావడంతో అతని అరెస్టు చేశారు అధికారులు.


 ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి బెంగళూరుకు 99 క్యాప్సిల్స్ లో రెండు కిలోల డ్రగ్స్ తీసుకొని నైజీరియా దేశస్తుడు వచ్చాడు. అయితే అతిపెద్ద కొకైన్ స్మగ్లింగ్ ప్రయత్నం అని అధికారులు ఇక ఈ ఘటనపై స్పందిస్తున్నారు  ఈ క్రమంలోనే నిందితుడు దగ్గర నుంచి 20 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాలి  అయితే నిందితుడి కడుపులో ఇలా డ్రగ్స్ తో కూడిన క్యాప్సిల్స్ ఉన్నాయని.. గ్రహించి ఏకంగా అతని ఆసుపత్రిలో చేర్పించి ఐదు రోజులపాటు కొకైన్ బయటికి తీసే ప్రక్రియను చేపట్టారు. కాగా ఎయిర్పోర్టులో నిందితుడి కదలికల మీద అనుమానం రావడంతో.. అతని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు నిందితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: