ఐపీఎల్ వేలంలో.. మాకు కావాల్సింది మేము దక్కించుకున్నాం?
ఈ క్రమం లోనే జట్టుకు భారంగా మారిన కొంత మంది ఆటగాళ్ళను వేలం లోకి వదిలేసింది. ఈ క్రమం లోనే తమ దగ్గర ఉన్న పర్స్ మనీతో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కీలకమైన ఆటగాళ్ళను జట్టులోకి తీసుకుంది. జట్టుకు ఎవరైతే ఉపయోగపడతారో.. ఇక విజయతీరాలకు చేర్చుతారూ అని నమ్మిందో వారి కోసం పోటీపడి మరి భారీ ధర వెచ్చించి జట్టులోకి తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్గా కొనసాగుతున్న ఫ్యాట్ కమిన్స్ ను 20.5 కోట్లు వెచ్చించి జట్టులో చేర్చుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.
ఈ క్రమం లోనే ఐపీఎల్లో పలువురు ఆటగాళ్ళను టీం లోకి తీసుకోవడం పై ఇటీవలే ఫ్రాంచైజీ స్పందించింది. వేలం లో తమకు కావాల్సింది తాము దక్కించుకున్నాం అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తెలిపింది. ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ తీసుకోవాలని భావించాం అలాగే తీసుకున్నాం. నాణ్యమైన స్పిన్ బౌలర్ను దక్కించుకోవాలనుకున్నాం.. హసరంగను సొంతం చేసుకున్నాం. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాం.. ప్యాట్ కమిన్స్ ను దక్కించుకున్నం. మరి కొంత మంది ఫాస్ట్ బౌలర్ ని కావాలని అనుకున్నాం అనుకున్న విధంగానే చేసాం అంటూ సన్రైజర్స్ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది.