పాపం మనిష్ పాండే.. మరి ఇంత తక్కువ ధరా?
ఎందుకంటే ఒక సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఆ తర్వాత సీజన్లో కొన్ని కొన్ని సార్లు అన్ సోల్డ్ గా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. లేదంటే ఇక బేస్ ప్రైస్ కే ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్ళను కొనుగోలు చేస్తూ ఉంటాయ్ ఇక ఇప్పుడు అటు టీమ్ ఇండియా బ్యాటర్ మనీష్ పాండేకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకానొక సమయంలో ఐపీఎల్ లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన మనీష్ పాండే.. ఇక ఇటీవలే కేవలం బేస్ ప్రైస్ అయిన 50 లక్షలకే అమ్ముడుపోయాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇక అతని గురించి తెలిసి అతని ఐపీఎల్ కెరియర్ రోలర్ కోస్టర్ను తలపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు అతడిని 11 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అయితే ఐపీఎల్లో మొత్తంగా 10 టీమ్స్ ఉంటే ఇప్పటివరకు ఏడు టీమ్స్ తరఫున మనిష్ పాండే ఆడాడు. తొలత ఇతన్ని ముంబై ఇండియన్స్ ఆరు లక్షలకు సొంతం చేసుకుంటే.. ఇక ఆ తర్వాత ఆర్సిబి 12 లక్షల పెట్టి తమ జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత సీజన్లో పూణే 20 లక్షలకు అతని తీసుకుంటే.. కోల్కతా 1.70 కోట్లు ధర పెట్టింది. ఇక తర్వాత సన్రైజర్స్ ఏకంగా 11 కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది. ఇదే అతని కెరియర్ లో అత్యధిక ధర కాగా.. ఆ తర్వాత లక్నో 4.6 కోట్లు, ఢిల్లీ 2.4 కోట్లు ఇక ఇప్పుడు కోల్కతా చివరికి బేస్ ప్రైస్ 50 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది.