పక్కన పెట్టిన ఫ్రాంచైజీలు.. వీరి ఐపీఎల్ కెరియర్ ముగిసినట్లేనా?
ఇంకొంతమంది ప్లేయర్లు భారీ ధర పలుకుతారు అనుకుంటే ఇక మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఎక్కువ ధరను సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఇక ఇటీవల జరిగిన మినీ వేలంలో కొంతమంది సీనియర్ ప్లేయర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ మొదటి నుంచి సీనియర్ ప్లేయర్లను పక్కన పెడుతూ వచ్చిన అన్ని ఫ్రాంచైజీలు ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఇదే ప్లాన్ తో వేలంలో పాల్గొన్నాయ్. దీంతో ఐపీఎల్ లో ఉన్న సీనియర్ ప్లేయర్లను పట్టించుకోలేదు. దీంతో కొంతమంది అన్ సోల్డ్ గానే మిగిలిపోయారు అని చెప్పాలి.
అయితే ఇలా అన్ సోల్డ్ గా మిగిలిపోయిన కొంతమంది ప్లేయర్ల కెరియర్ దాదాపు ముగిసినట్టే అన్నది తెలుస్తుంది. ఆ వివరాలు చూసుకుంటే ఇటీవల వేలంలో ఫ్రాంచైజీలు పక్కన పెట్టిన సీనియర్ క్రికెటర్లలో సురేష్ రైనా, మురుగన్ అశ్విన్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ లు ఉన్నారు. వీరంతా ఐపీఎల్లో ఒక వెలుగు వెలిగిన వారే. 2017లో రైనాకు 12.5 కోట్లు వెచ్చించి గుజరాత్ లయన్స్ సొంతం చేసుకుంది.. 2016లో మురుగన్ అశ్విన్ ను పంజాబ్ టీం 4.5 కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది. 2018లో కరుణ్ నాయర్ ను 5.8 కోట్లతో పంజాబ్ సొంతం చేసుకుంది. 2018లో బెంగుళూరు మూడు కోట్లు పెట్టి సర్పరాజజ్ ను తీసుకుంది. కానీ ఇప్పుడు వీరిని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దీంతో వీరి కెరియర్ ముగిసినట్లే అంటూ క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.