మినీ న్యూజిలాండ్ గా మారిన.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్?
ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. అయితే మహేంద్ర సింగ్ ధోని ఎవరైనా ఆటగాడిని వేలంలో పోటీపడి జట్టులోకి తీసుకున్నాడు అంటే ఇక ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరించి ఉంటాడు అని అభిమానులందరూ కూడా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇటీవల జరిగిన వేలంలో కొంతమంది ఆటగాళ్ళను ధోని టీం లోకి తీసుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సీఎస్కే టీం గురించి ఒక ఆసక్తికర వార్త కూడా వైరల్ గా మారిపోయింది. చెన్నై జట్టు మినీ న్యూజిలాండ్ టీం గా మారిపోయింది అంటూ కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన వేలంలో చెన్నై జట్టు డారెల్ మిచెల్ ను 14 కోట్లు, రచిన్ రవీంద్రను 1. 80 కోట్లకు దక్కించుకుంది. ఇక వీరిద్దరి రాకతో చెన్నై జట్టులో ఉన్న కివీస్ ప్లేయర్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే డేవాన్ కాన్వే మిచెల్ శాంట్నర్ చెన్నై జట్టులో ఉన్నారు. వారికి తోడు ఇక ఇప్పుడు మరో ఇద్దరు చేరారు. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్గా న్యూజిలాండ్ కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉండడం గమనార్హం. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక ఇప్పుడు ఏకంగా మినీ న్యూజిలాండ్ టీం గా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. అయితే చెన్నై జట్టులో ఇంతమంది కివీస్ కు చెందిన వారు ఉన్నారు అంటే మీకు కూడా అదే అనిపిస్తుంది కదా.