టాయిలెట్ పేపర్ కోసం.. బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పింది?
ఇక ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత వామ్మో ఇలాంటి కారణాలకు బ్రేకప్ చెప్పేస్తారూ అంటే లవ్ చేయకపోవడమే బెటర్ అనే భావన నేటి రోజుల్లో యువతీ యువకుల్లో కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ముమ్మాటికి ఇలాంటి కొవ్వలోకి చెందినదే. ఇక్కడ ఒక యువతి బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పడానికి గల కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఇంత చిన్న కారణానికి ప్రేమికుడిని దూరం చేసుకుంటారా అనే భావన మీకు కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జంట బ్రేకప్ చెప్పుకొని విడిపోవడానికి అంత వింతైన కారణం ఉంది అని చెప్పాలి.
మేరియా కార్ల అనే యుఎస్ మహిళ విషయంలో టాయిలెట్ పేపర్ ఏకంగా ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి కారణం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ ఇంటి బాత్రూం లో టాయిలెట్ పేపర్ ఉండేది కాదట. అయితే కొనమంటే మరిచిపోయాను అని చెప్పి తప్పించుకునే వాడట ప్రియుడు. ఓసారి షాపింగ్ చేస్తుండగా టాయిలెట్ పేపర్ కొనమంటే ససేమిరా అన్నాడట. తాను వైట్ వైప్స్ మాత్రమే వాడుతాను అంటూ చెప్పేసాడట. ఇక ఈ కారణంతో ప్రియుడికి బ్రేకప్ చెప్పాను అన్న విషయాన్ని ఆ యువతి సోషల్ మీడియాలో చెప్పడంతో ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.