పింక్ జెర్సీ ధరించిన దక్షిణాఫ్రికా ప్లేయర్లు.. కారణమిదే?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా ద్వైపాక్షిత సిరీస్ లు ఆడుతుంది అని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగి ఇక టి20 సిరీస్ ను ముగించుకుంది టీం ఇండియా. అయితే మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మూడో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో 1-1 తో సిరీస్ సమం అయింది అని చెప్పాలి.




 అయితే ఇక నేటి నుంచి ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది టీమిండియా. కేఎల్ రాహుల్ సారథ్యంలో వన్డే సిరీస్ లో భాగంగా బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మొదటి వన్డే మ్యాచ్ లో భాగంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వేసుకునే జెర్సీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. సాధారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక ఇటీవలే మొదటి వన్డే మ్యాచ్లో మాత్రం ఏకంగా పింక్ కలర్ జెర్సీ ధరించి బరిలోకి దిగారు ప్లేయర్లు.


 అయితే ఇక ఇలా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ధరించిన పింక్ కలర్ జెర్సీ కాస్త ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఎందుకు ఇలా పింక్ కలర్ జెర్సీ ధరించారు అని తెలుసుకునేందుకు ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే ఇక మొదటి వన్డే మ్యాచ్ లో పింక్ కలర్ జెర్సీని ధరించారు అన్నది తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రతి సంవత్సరం కూడా పింక్ డేనీ సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బులు అని కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి విరాళంగా ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: