ముంబై ఇండియన్స్ జట్టుకి.. 13 లక్షల మంది షాక్ ఇచ్చారుగా?
సూపర్ సక్సెస్ అయిన కెప్టెన్ ని పక్కన పెట్టడం ఏంటి.. రోహిత్ కంటే మెరుగైన కెప్టెన్ మీకు దొరుకుతాడా అని అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మను ఇలా సడన్గా కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అటు రోహిత్ అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు రోహిత్ కోసమే ముంబై ఇండియన్స్ కి మద్దతు పలికాము. కానీ ఇకనుంచి అసలు ముంబై ఇండియన్స్ కి మద్దతు పలకబోము అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.
అయితే ఇక ఇప్పుడు లక్షలాదిమంది రోహిత్ శర్మ అభిమానులు.. అటు ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఏకంగా సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇంస్టాగ్రామ్ లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ని ఎనిమిది లక్షల మంది రోహిత్ అభిమానులు అన్ ఫాలో చేశారు. రోహిత్ కెప్టెన్సీ తొలగింపు పై ప్రకటన రాకముందు ఇంస్టాగ్రామ్ లో ముంబైకి 13.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా ఇక ఇప్పుడు 12.5 మిలియన్ల మందికి తగ్గారు. మరోవైపు ఎక్స్ సోషల్ మీడియా లో కూడా దాదాపు 5 లక్షల మంది అన్ ఫాలో చేశారు అని చెప్పాలి. ఇక రెండు సోషల్ మీడియా ఖాతాలలో కలిపి 13 లక్షల మంది రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్ కి షాక్ ఇచ్చారు.