రిషబ్ పంత్.. టీమ్ ఇండియాలోకి వచ్చేది అప్పుడేనట?

praveen
టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ కెరియర్ రోడ్డు ప్రమాదం కారణంగా ఒక్కసారిగా ఆగిపోయింది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఇక ఈ ప్రమాదంలో అతను ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైపోయింది. అంతేకాదు రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలు అయ్యాడు అని చెప్పాలి. ఇక అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడగలిగాడు. అయితే రోడ్డు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ అటు క్రికెట్ కి పూర్తిగా దూరమైపోయాడు. కొన్నాళ్లపాటు కేవలం బెడ్ కే పరిమితం అయ్యాడు.


 అయితే మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్న రిషబ్ పంత్ ఇక పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో అతను క్రికెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే 2024 ఐపీఎల్ సీజన్ నాటికి రిషబ్ పంత్ ఇక జట్టులోకి వచ్చేస్తాడు అన్న విషయం పై క్లారిటీ ఉంది. అయితే అతను టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడు అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 ప్రస్తుతం టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీగా ఉంది. అటు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. అయితే ఇక ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నాటికి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటాడు అన్నది తెలుస్తుంది. ఈ సిరీస్లో అతను ఆడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక లక్ష్యాల దృశ్య ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు టాక్ కూడా ఉంది. నేరుగా ఐపిఎల్ లోనే ఆడించాలని అనుకుంటున్నారట. అయితే రిషబ్ పంత్ రీ ఎంట్రీ కోసం అటు అభిమానులు మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: