ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెడుతున్న.. రోహిత్ ఫ్యాన్స్?

praveen
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను  సిద్ధం చేసుకున్నాయి అని చెప్పాలి. అయితే డిసెంబర్ 19వ తేదీన అందరూ ఎదురు చూస్తున్న మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది. ఇక ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లు ఉండడంతో భారీ ధర పలికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక వేలం జరగడానికి ముందే ట్రేడింగ్ ద్వారా కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న కొన్ని టీమ్స్ యాజమాన్యాలు ఏకంగా వారికి కెప్టెన్సీ అప్పగించడం కూడా చూస్తూ ఉన్నాం.

అయితే ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీం లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ జట్టు తలరాతను మార్చి 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టేసింది యాజమాన్యం. అంతకుముందు తమ జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగి ఆ తర్వాత బయటకు వెళ్లిన హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుని మరీ సారధ్య బాధ్యతలను అతని చేతిలో పెట్టింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకుని నిర్ణయం అందరిని షాక్ కి గురి చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 మరి ముఖ్యంగా ఈ నిర్ణయంతో అటు రోహిత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యలో మునిగిపోయారు. ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ ను పక్కన పెట్టడం ఏంటి అన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయం పై రోహిత్ ఫ్యాన్స్ అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి కెప్టెన్ గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కనీస గౌరవం ఇవ్వలేదని అకస్మాత్తుగా తొలగించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని పలు నగరాలలో ముంబై ఇండియన్స్ జట్టు జెర్సీలను రోహిత్ అభిమానులు కాల్చివేస్తున్నారు. ఇన్ని రోజులు రోహిత్ మీద ఇష్టంతోనే ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ చేశామని ఇక నుంచి సపోర్ట్ చేయము అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: