ఒకప్పుడు అన్ సోల్డ్.. కానీ ఇప్పుడు జట్టు కెప్టెన్?
ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్గా నిలిపి ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను.. సారాధ్య బాధ్యతలనుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఏకంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ జట్టు నుంచి పిలిచి మరి అతని చేతిలో కెప్టెన్సీ పెట్టింది ముంబై ఇండియన్స్. ఇక ఈ విషయం గురించి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర విషయాలు తెరమీదకి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబై కెప్టెన్గా ఎంపికైన హార్థిక్ పాండ్య ప్రస్థానం ఎలా సాగింది అనే విషయంపై కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు చూసుకుంటే.. హార్థిక్ పాండ్యా 2014 వేలంలో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. ఇక 2015 వేలంలో కనీస ధర అయినా పది లక్షలకే ముంబై సొంతం చేసుకుంది. ఇక మళ్లీ రిటైన్ చేసుకున్న తర్వాత మాత్రం అతనికి ఏకంగా 11 కోట్లు చెల్లించింది ముంబై ఇండియన్స్. ఇక ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుండి మళ్లీ పిలిపించుకున్నప్పుడు 15 కోట్లతొ పాటు మరింత పారితోషికం కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఇప్పటికే బాధ్యతలను చేపట్టింది. ఇలా ఒకప్పుడు అన్సోల్డ్ గా ఉన్న హార్దిక్ ఇక ఇప్పుడు ఏకంగా జట్టు కెప్టెన్ గా అవతరించాడు అని చెప్పాలి.