రిటైర్మెంట్ కి ముందు.. డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు?

praveen
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ఇప్పటికే అందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు ఈ స్టార్ ప్లేయర్. ఎప్పుడు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ గా బరిలోకి దిగుతూ అతను బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయిపోయాడు.


 మరి ముఖ్యంగా అటు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి.. ఒకసారి టైటిల్ అందించి ఏకంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సన్రైజర్స్ జట్టులో ఆడకపోయినప్పటికీ అటు తెలుగు క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డేవిడ్ వార్నర్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అయితే ఇక ఈ లెజెండరీ క్రికెటర్ ప్రస్తుతం తన కెరీర్ లోనే చివరి టెస్టు సిరీస్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది.


 ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్ తన సుదీర్ఘమైన టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో అతను మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకోగా.. ఇటీవల ఫస్ట్ టెస్ట్ లోనే సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇప్పటివరకు 110 టెస్ట్ మ్యాచ్లో 8,651 పరుగులు చేశాడు వార్నర్. ఆసిస్ మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ 8643 పరుగులను అధిగమించాడు. తొలి స్థానంలో రికీ పాంటింగ్ 13378 పరుగులతో ఉండగా ఆ తర్వాత అలెన్ బోర్డర్ 11174, స్టీవ్ వా 10927 పరుగులు   స్టీవ్ స్మిత్ 9,357 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: