నిజంగా ఈమె అదృష్టవంతురాలే.. ఎందుకో తెలుసా?

praveen
సాదరణంగా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత విధి చాలా మంది విషయంలో పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది విషయంలో మాత్రం షాకింగ్ ఘటనలు జరుగుతూ ఉంటాయి. దాదాపుగా ప్రాణాలు కోల్పోతారు అనే రేంజ్ లో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కూడా కొంతమంది ఏకంగా చిన్న చిన్న గాయాలతో బయటపడటం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక ఇలాంటి ఘటనలు చూశారు అంటే భూమి మీద నిజంగానే నూకలు తినే బాకీ ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మహిళ విషయంలో ఇలాంటిదే జరిగింది. ఏకంగా 200 అడుగుల లోయలో ఆమె కారు పడిపోయింది. ఆమె వయసు 72 ఏళ్లు. ఏకంగా నాలుగు రోజుల వరకు ఆ యాక్సిడెంట్ గురించి ఎవరూ చూడలేదు. అలాంటి సమయంలో ఆ వృద్ధురాలు బ్రతుకుతుందా అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలా బ్రతుకుతుంది అని అంటారు ఎవరైనా. కానీ ఆమెకు మాత్రం భూమ్మీద నూకలు తినే బాకీ ఉంది. ఎందుకంటే ఆమె బ్రతికి బట్ట కట్టింది.


 వినడానికి షాకింగ్ గా ఉంది కదా. కానీ ఈ ఘటన యూఎస్ లో నిజంగానే జరిగింది. ఏకంగా కారు ప్రమాదంలో 200 అడుగుల లోయలో పడిపోయిన 72 ఏళ్ల వృద్ధురాలు.. నాలుగు రోజుల తర్వాత కూడా ప్రాణాలతో బయటపడింది. పెన్ని కె క్లర్క్ అనే మహిళ డిసెంబర్ ఐదవ తేదీ నుంచి కూడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతకడం ప్రారంభించారు. అయితే డిసెంబర్ 9వ తేదీన కారు ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని గుర్తించారు పోలీసులు. వెంటనే అక్కడికి అధికారులు వెళ్లి చూడగా నాలుగు రోజుల తర్వాత కూడా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన మహిళ ప్రాణాలతో ఉండడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: