ఐపీఎల్ లో మోస్ట్ బ్రాండ్ వాల్యు ఉన్న టీమ్.. ఏదో తెలుసా?

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలైంది. ఇక 2024 సీజన్ కోసం బీసీసీఐ అన్ని సన్నాహాలను చేస్తుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. అన్ని టీమ్స్ కూడా తమతో అంటిపెట్టుకొనే ఆటగాళ్ల వివరాలతో పాటు వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ డీటెయిల్స్ ని కూడా ప్రకటించాయి అని చెప్పాలి. ఇక మరోవైపు డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ కూడా జరగబోతుంది. దుబాయ్ వేదికగా ఈ ఆక్షన్ ఉండబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్న నేపథ్యంలో.. ఎవరికీ అత్యధిక ధర పలుకుతుంది అన్నది మాజీ ఆటగాళ్లు తమ అంచనాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. ఇక ఏ టీం దగ్గర ఎంత పర్స్ మని ఉంది. ఏ టీం ఏ ఆటగాడిని సొంతం చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అన్నది కూడా తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ వాల్యుబుల్ టీం ఏది అన్నది కూడా తెలుసుకోవడానికి ప్రేక్షకులు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. అయితే ఇలా ఐపిఎల్ లో మోస్ట్ వాల్యుబుల్ టీంగా ముంబై ఇండియన్స్ గెలిచింది. ఈ జట్టు బ్రాండ్ వాల్యూ 725 కోట్లుగా ఉంది. ముంబై చాంపియన్ టీం గా కొనసాగుతుంది. ఇక మరో ఛాంపియన్ టీం అయినా చెన్నై సూపర్ కింగ్స్ 675 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కోల్కతా 657 కోట్లు, బెంగళూరు 582 కోట్లు, ఢిల్లీ 541 కోట్లు, గుజరాత్ 533 కోట్లు, రాజస్థాన్ 516 కోట్లు, సన్రైజర్స్ 400 కోట్లు, లక్నో 391 కోట్లు, పంజాబ్ 375 కోట్ల బ్రాండ్ వాల్యూ తో ఐపీఎల్ లో కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: