కేఎల్ రాహుల్.. ఇక నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్?
ఆ ప్లేయర్ ఎవరో కాదు కేఎల్ రాహుల్. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ గా కీలక బ్యాట్స్మెన్ గా కూడా అదరగొడుతూ ఉన్నాడు రాహుల్. ఇక మంచి ఫామ్ లో ఉంటూ టీమ్ ఇండియాను విజయ తీరాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు అతని ఏకంగా టెక్నికల్ బ్యాట్స్మెన్ అని కూడా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. అయితే భారత జట్టులో అతని స్థానం ఏంటి అన్న విషయంపై ఇప్పటికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరైనా ఓపెనర్ అందుబాటులో లేకపోతే.. ఓపెనింగ్ కి వస్తూ ఉంటాడు. లేదంటే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తుంటాడు. కొన్ని కొన్ని సార్లు ఇక వన్ డౌన్ లో బ్యాటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దీంతో అతన్ని ఓపెనర్ అనలా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనాలా కూడా అభిమానులకు అర్థం కాదు. అయితే ఇక నుంచి రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా అవతారం ఎత్తబోతున్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్లో రాణిస్తున్నాడు రాహుల్. ఇకపై పూర్తిగా ఆ స్థానం పైన ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ తో కూడా చర్చలు జరుపుతున్నాడట. ఐపీఎల్లోనూ మిడిల్ ఆర్డర్లోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అన్ని ఫార్మాట్లలో బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా రాణించేందుకే కేఎల్ రాహుల్ ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలుస్తుంది.