మిస్టర్ 360 సూర్య.. అరుదైన రికార్డ్?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన బ్యాటింగ్ తీరుతో అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు ఈ విధ్వంసకర ప్లేయర్. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడంలో సూర్య కుమార్ యాదవ్ దిట్ట అని చెప్పాలి. ఏకంగా తనదైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా గుర్తింపును సంపాదించుకున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొట్టడంలో సూర్య కుమార్ యాదవ్ దిట్ట అని చెప్పాలి.

 ఎలాంటి బంతినైనా సరే బౌండరీకీ తరలించగల సత్తా అతని సొంతం. అయితే ఇలా టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఐసీసీ ప్రకటించే టి20 ర్యాంకింగ్స్ లో అటు నెంబర్ వన్ స్థానంలో కూడా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అతను  దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాకు టి20 ఫార్మాట్ లో సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్లో తన సారథ్యంతో భారత జట్టుకు సిరీస్ ను అందించాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా అతనికి టి20 సిరీస్ కెప్టెన్సీ అవకాశం దొరికింది.

 టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్లో భారత జట్టుకు వర్షం అంతరాయం కలిగించడంతో చివరికి ఓటమి తప్పలేదు అని చెప్పాలి. అయితే భారత జట్టు ఓడిపోయినప్పటికీ అటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం అరుదైన రికార్డు సృష్టించాడు. అతి తక్కువ బంతుల్లోనే 2000 పరుగులను పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ గా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్. 1163 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్ల వారిగా చూస్తే అతను నాలుగో ప్లేస్ లో ఉన్నాడు అని చెప్పాలి. బాబర్ 52 మ్యాచ్ లో 2000 పరుగులు పూర్తి చేస్తే ఆ తర్వాత రిజ్వాన్ 52 మ్యాచులు, విరాట్ కోహ్లీ 56 మ్యాచ్లలో ఇలా రెండువేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్లుగా మొదటి మూడు స్థానాలలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: