అలా అయితే.. రోహిత్ ను కెప్టెన్ గా సెలెక్ట్ చేయ్యొద్దు : గంభీర్

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడచూసిన ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే వచ్చే ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ గురించి 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నిలో టీమిండియా అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించినప్పటికీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంతో చివరికి టైటిల్ గెలుచుకోలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2024 టీ20 వరల్డ్ కప్ అయినా గెలవాలని అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక వచ్చే ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కెప్టెన్సీ ఎవరికీ ఇస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

 సాధారణంగా అయితే ప్రస్తుతం భారత క్రికెట్లో మూడు ఫార్మాట్లకు రెగ్యులర్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. కానీ ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్ కు పూర్తిగా దూరమైపోయాడు. రోహిత్ అందుబాటులో లేకపోవడంతో హార్దిక్ పాండ్యా టి20 కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఒక రకంగా తాత్కాలిక కెప్టెన్ అంటున్నప్పటికీ ఇక అతనే పూర్తిగా టి20 జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి టీ20లకు దూరంగా ఉన్నారు రోహిత్.. మళ్ళీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ చేపడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఇక బిసిసిఐ కూడా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో జట్టును నడిపించే కెప్టెన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై గౌతమ్ గంభీర్  స్పందించాడు. ఫామ్ లో ఉన్న ప్లేయర్ని t20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా నియమించాలి అంటూ గంభీర్  సూచించాడు. ఒకవేళ రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉంటే అతడే టి20 కెప్టెన్ గా వ్యవహరించాలి. ఫామ్ లో లేకపోతే జట్టుకు సెలెక్ట్ చేయవద్దు. ఎందుకంటే కెప్టెన్సీ అనేది ఒక బాధ్యత. తప్పకుండా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. కాబట్టి అతని ఫామ్ కూడా ఎంతో ముఖ్యం అంటూ సూచించాడు గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: