హార్దిక్ రీ ఎంట్రీపై.. జై షా కీలక వ్యాఖ్యలు?

praveen
టీమ్ ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ తమ టీం లో కూడా ఉంటే ఎంత బాగుండు అని ఇతర టీమ్స్ అనుకునే విధంగా అతని ఆట తీరు కొనసాగుతూ ఉంటుంది. బౌలింగ్లో కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టడమే కాదు బ్యాటింగ్లో జట్టుకు అవసరమైన ప్రతిసారి కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు హార్థిక్ పాండ్యా.


 ఇక ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా సక్సెస్ అయిన తర్వాత ఇక భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్ అతనే అనే ఒక ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మకు బదులు టీ20 ఫార్మాట్కు ఇక సారధ్య బాధ్యతలను కూడా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో గాయం బారిన పడ్డాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం బారిన పడి ఇక వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం దూరమయ్యాడు అని చెప్పాలి.  వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.



 ఈ క్రమంలోనే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో.. హార్దిక్ పాండ్య ఎప్పుడు మళ్లీ టీం లోకి రీ ఎంట్రీ ఇస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందించాడు. హార్దిక్ పాండ్యా కోలుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టి20 సిరీస్ కు అతను ఫిట్నెస్ సాధించి జట్టులో చేరుతాడు అంటూ స్పష్టం చేశాడు. అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పై దక్షిణాఫ్రికా టూర్ తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపాడు. కాగా జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: