కూతురు అదృష్టం తెచ్చింది.. అతను వరల్డ్ కప్ గెలిచేసాడు?
కొంతమంది అయితే అబ్బాయిని వద్దనుకుని.. ఏరి కోరి మరి ఆడపిల్లలకు జన్మనిస్తున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఆడపిల్ల పుట్టిందంటే నిజంగానే అదృష్టం వరిస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు వరకు ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏ ఆడపిల్ల తండ్రిని అడిగినా కూడా నా కూతురు పుట్టిన తర్వాతే.. నా ఎదుగుదల మొదలైంది. ఆమె నాకు అదృష్ట లక్ష్మి అని చెబుతారు. అయితే ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ కి కూడా ఇలా కూతురు పుట్టిన తర్వాతే ఆ అదృష్టం తలుపు తట్టింది అనేది తెలుస్తుంది.
ట్రావీస్ హెడ్.. ఈ పేరును భారత క్రికెట్ ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు. ఎందుకంటే 140 కోట్ల మంది భారత అభిమానులకు వేదన మిగిల్చిన ప్లేయర్ అతను. ఫైనల్ మ్యాచ్లో క్రీజ్ లో పాతుకుపోయి ఏకంగా సెంచరీ చేసి ఆస్ట్రేలియాను గెలిపించిన మొనగాడు. అందరూ తడబడుతున్న పిచ్ పై సైతం పరుగుల వరద పారించిన ధీరుడు. అంతే కాదు ఇక రోహిత్ శర్మ క్యాచ్ పట్టి అటు భారత్ ను దెబ్బ కొట్టింది కూడా అతనే. అలాంటి ట్రావిస్ హెడ్ ను కూతురు పుట్టినప్పుడు నుంచి అదృష్టం వరిస్తుంది. 2022 సెప్టెంబర్ లో అతనికి కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తొమ్మిది నెలలకు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో ఇండియా పై సెంచరీ చేసి ఇక తమ దేశానికి టైటిల్ అందించాడు. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో మరోసారి సెంచరీ చేసి ఇండియా పైనే వీరోచిత పోరాటం చేసి జట్టును గెలిపించాడు.