రోహిత్.. ఆ షాట్ ఆడకుండా ఉండాల్సింది : గవాస్కర్

praveen
ఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ ట్రోఫీ ముగిసింది. అయితే ఇక ఈ ప్రపంచ కప్ లో సొంత గడ్డపై భారత జట్టు విశ్వవిజేతగా నిలుస్తుంది అని అందరూ ఊహించినప్పటికీ అది జరగలేదు. ఏకంగా ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు మరోసారి పరాభవం ఎదురయింది. గత కొన్ని వరల్డ్ కప్ల నుంచి కూడా నాకౌట్ మ్యాచ్లలో చేతులెత్తేస్తూ వచ్చిన భారత జట్టు ఇక మరోసారి ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఇలా వరల్డ్ కప్ ఫైనల్లో గెలుస్తుంది అనుకున్నట్టు ఓడిపోవడానికి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై కూడా ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక ఇలాంటివి కాస్త హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే రోహిత్ శర్మ ఒక షాట్ ఆడకుండా ఉండాల్సింది అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ శర్మ ఎంతో దూకుడుగా ఆడుతూ సిక్సర్లు ఫోర్ లతో విరుచుకుపడ్డాడు.


 కానీ ఆ తర్వాత వరుసగా మరో సిక్సర్ కు ట్రై చేయడంతో చివరికి వికెట్ కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయం గురించి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఏకంగా రోహిత్ కు అప్పటికే సిక్సర్ ఫోర్ వచ్చింది. ఇక ఆ దశలో మరో షాట్కి వెళ్లకుండా ఉండాల్సింది. అయితే అది సరిగా తాకి ఉంటే సిక్సర్ పోయేది. అర్థ సెంచరీ చేస్తే మనందరం చప్పట్లు కొట్టే వాళ్ళమే. కానీ ఆ దశలో అంత దూకుడు అవసరం లేదు. తర్వాత ఎలాగో ఐదో బౌలర్ వచ్చేవాడు. అతన్ని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: